తెలంగాణ
KTR: రేవంత్‌వి అన్నీ డైవర్షన్ పాలిటిక్స్

KTR: మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. నేను జీవితంలో ఏనాడు సిగరెట్ కూడా తాగలేదు అన్నారు. రేవంత్ అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి 20 నెలల్లో చేసింది శూన్యం అన్నారు. నా విషయంలో ఓసారి డ్రగ్స్ అంటారు. ఓసారి కార్ రేసింగ్ అంటున్నారన్నారు. దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలి అని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేశాడు? అని ప్రశ్నించారు. డ్రగ్స్, రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లకు దూరంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి అర్హుడు కాదు అని హితవు పలికారు. రేవంత్ వల్ల యూట్యూబర్లకు తప్ప ఎవరికి లాభం లేదు అన్నారు.