KTR: రేవంత్ సర్కార్ కాదు సర్కస్ నడుస్తోంది

KTR: రాష్ట్రంలో నడుస్తోంది సర్కార్ కాదు సర్కస్ అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల పంచాయితీ రచ్చ అధికారులు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు తీసుకొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిన్న కొండా సురేఖ-పొంగులేటి, నేడు జూపల్లి కృష్ణారావు-సీఎం రేవంత్ రెడ్డి ముఠాల పంచాయితీ కాంగ్రెస్ అవినీతి పీక్ స్టేజ్‌లోకి చేరిందనే విషయాన్ని రుజువు చేస్తుందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పాయింట్ బ్లాంక్‌లో పారిశ్రామికవేత్తలను గన్‌పెట్టి బెదిరిస్తుంటే ఖాళీ డ్రెస్ వేసుకున్న డీజీపీ కాంగ్రెస్ బుక్ ఫాలో అవుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్.
రాష్ట్రంలో జాయింట్ వెంచర్ సర్కార్ ఉన్నందునే సీబీఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ రావాట్లేదని బీజేపీ-కాంగ్రెస్ బంధంపై ఆరోపణలు గుప్పించారు కేటీఆర్. ఐఏఎస్ అధికారి రిజ్వీ పదవీ విరమణ వెనక ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లి పంపకాల పంచాయితీ ఉందని, వారిద్దరి పోరు తట్టుకోలేకే సమర్థవంతమైన అధికారి తప్పుకున్నాడని కేటీఆర్ ఆరోపించారు. శిశుపాలుడి తప్పులు లెక్కబెట్టినట్లు రేవంత్ టైమ్ దగ్గర పడుతుందని.. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్, మంత్రులు, కొద్ది మంది అధికారుల పాత్రను వెలికితీసి ఊచలు లెక్కపెట్టిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.



