తెలంగాణ
KTR: కటింగులు, కటాఫ్‌లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో.. తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి

KTR: కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదని.. కటింగులు, కటాఫ్‌లు తప్ప అంటూ కామెంట్ చేశారు. అన్నింటిలోనూ కటింగ్‌లే అని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతీ హామీల్లోనూ కటింగ్‌లు, కటాఫ్‌లతో ప్రజలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు మాజీ మంత్రి.