తెలంగాణ
KTR: కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచింది

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని ఇదే స్పూర్తితో ముందుకువెళ్లాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ది గెలుపే కాదని దొంగ ఓట్లతో గెలిచిందని కేటీఆర్ అన్నారు. వచ్చే రెండు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని, బల్దియాలో గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.



