తెలంగాణ
రేపు ఢిల్లీకి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు

Delhi: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే వారు హస్తినకు వెళ్లనున్నారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిలపై.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు.. ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులకు.. సుప్రీంకోర్టు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.