తెలంగాణ
ఓయూలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

మాజీ మంత్రి కేటీఆర్ ను తట్టుకోలేక విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. ఓయూ BRSV నాయకులు రమేష్, నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలు, గొడుగులను మాజీ ఎమ్మెల్యే గాధరి కిశోర్, BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పంపిణీ చేశారు.
కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీదుకువెళ్లే నేర్పు, నైపుణ్యత ఉన్న వ్యక్తి కేటీఆర్ అని కొనియాడారు. భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి ఎదిగి, తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగాలని గాదరి కిషోర్, గెల్లు శ్రీనివాస్ ఆకాంక్షించారు.