సినిమా
Kriti Sanon: ధనుష్ పై కృతి సనన్ పొగడ్తల వర్షం!

Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ తమిళ స్టార్ ధనుష్‌ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించింది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో కలిసి నటించిన అనుభవం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో ధనుష్‌తో కలిసి నటించిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఆయన నటన, క్రాఫ్ట్ పట్ల అభిమానం వ్యక్తం చేసింది. “ధనుష్ తన పాత్రల్లో అనేక లేయర్లు తెప్పిస్తాడు. ఆయనతో నటించడం నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది.
ఆయన నటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను” అని కృతి అన్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి సృష్టించిన సన్నివేశాలు మాయాజాలం లాంటివని, భవిష్యత్తులో మళ్లీ పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ధనుష్ సహజమైన నటన, పాత్రల పట్ల గట్టి పట్టు ఉండటంతోనే ప్రేక్షకుల మనసుల్ని ఆకర్షిస్తూ వస్తున్నారు. ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అంచనా.



