కృతి శెట్టి కోలీవుడ్ బ్రేక్

కార్తీతో కలిసి కృతి శెట్టి వా వాతియార్ సినిమాతో పెద్ద స్క్రీన్‌పై కనిపించింది. తమిళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ఆకట్టుకుంటోంది. తెలుగులో హిట్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్ట్రెస్ గత కొంతకాలంగా సతమతమవుతోంది. అందుకే కోలీవుడ్ వైపు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కృతికి కొత్త ఊపిరి పోస్తున్నట్లు టాక్..
కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం వా వాతియార్ నేడు తమిళంలో థియేటర్లలోకి వచ్చింది. నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఉప్పెన, శ్యామ్ సింగారాయ్, బంగార్రాజు వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన కృతి గత కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమె తెలుగు సినిమాల నుంచి కొంత దూరంగా ఉండి కోలీవుడ్ వైపు దృష్టి మళ్లించింది.
వా వాతియార్ సినిమాతో కృతి శెట్టికి మళ్లీ బ్రేక్ రావడం గమనార్హం. ఈ చిత్రాన్ని K.E జ్ఞానవెల్ రాజా నిర్మించారు. తెలుగులో ఈ సినిమా అన్నగారు వొస్తారు అనే టైటిల్‌తో విడుదల కానుంది. మరి తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. కృతి శెట్టి కెరీర్‌లో ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ కాబోతుందని అంటున్నారు.



