తెలంగాణ
Rosaiah: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి కన్నుమూత

Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ (86) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్‌పేటలోని నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.



