తెలంగాణ
వరంగల్ లో స్వర్ణ VS కొండా.. కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విబేధాలు

వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాశిబుగ్గలోని విగ్రహం దగ్గర కార్యక్రమం కోసం కొండా వర్గీయులు ఏర్పాట్లు చేశారు. కానీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి కన్నా ముందుగానే పూలదండ వేసి నివాళి అర్పించారు. ఇంతలోనే మంత్రి సురేఖ రావడంతో కొండా వర్గీయులు పెద్ద ఎత్తున జై కొండా అంటూ నినాదాలు చేశారు.
అవి ఏమీ పట్టించుకోకుండా ఎర్రబెల్లి స్వర్ణ తన వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి వేసిన పూలమాలలు తీసి పక్కకు పెట్టాక మంత్రి సురేఖ ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ అంతా జై కొండ నినాదాలతో మార్మోగింది.



