తెలంగాణ
Konda Surekha: అనేక మంది త్యాగఫలమే ప్రజాపాలన

Konda Surekha: అనేకమంది త్యాగఫలమే ప్రజాపాలన దినోత్సవమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు.
జిల్లాలో 8871 ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడత మంజూరు చేశామని, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా 14 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.



