తెలంగాణ

కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ వస్తారా..లేదా?

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఓఎస్‌డీ సమంత్‌ ఎపిసోడ్‌ సంచలనంగా మారుతోంది. ఆయన్ని అరెస్టు చేయడానికి వచ్చారని కొండా సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులతో వాగ్వాదనికి దిగడం మరింత రచ్చ జరిగింది. ఇదంతా టార్గెటెడ్‌గా చేస్తున్నారని కొండా ఫ్యామిలీ ఆరోపిస్తుంది. ఓఎస్‌డీ సమంత్‌‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెంటనే తొలగించింది. అయితే మంత్రినైన తనకు సమాచారం ఇవ్వకుండానే సుమంత్‌ను ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో సుదీర్ఘకాలంగా ఉన్న రాజకీయ విభేదాలు, ఇటీవల ఆమె ఓఎస్‌డీ తొలగింపు వంటి కారణాలు దీనికి కారణం అయి ఉండొచ్చని రాజకీయాల్లో చర్చలు నడుస్తున్నాయి. మేడారం కాంట్రక్టుల వ్యవహరంలో పొంగులేటి అంశం, రెడ్లు తనను టార్గెట్ చేశారని మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

మరో వైపు నేడు జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ వస్తారా..లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే వరుస వివాదాలు కొండా సురేఖను చుట్టుముడుతున్నాయి. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. తరచూ మంత్రుల మధ్య వివాదాలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది.ఇప్పుడు ఈ ఇష్యూపై పార్టీ,ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button