తెలంగాణ

Konda Surekha: నా మాటలను కొందరు వక్రీకరించారు

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్‌గా దుమారం రేపుతున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్‌పై మరోసారి స్పందించారు మంత్రి కొండా సురేఖ. తన మాటలను కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తాను మంత్రులు అని మాత్రమే చెప్పానన్న సురేఖ కాంగ్రెస్ మంత్రులని ఎక్కడా చెప్పలేదని వివరించే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునే వారని సురేఖ ఆరోపించారు. అయితే ఫ్రస్టేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీలని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు కొందరు నెటిజన్లు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button