తెలంగాణ
Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

Konda Surekha: మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి సురేఖపై పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదు చేశారు. పశ్చిమ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇద్దరు నూతన ధర్మకర్తలను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జీవో 373 జారీ చేయడంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యేను అయిన తనకు తెలియకుండా ధర్మకర్తలను ఎలా నియమిస్తారని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి శాసనసభ్యుడు తీసుకెళ్లారు. మంత్రి సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి సురేఖ వర్సెస్ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పొలిటికల్ ఫైట్ జరుగుతోంది.



