ఆంధ్ర ప్రదేశ్
దసరా నిప్పుల గుండం దగ్గర పేలిన చిచ్చుబుడ్డి

అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం మత్స్యకార గ్రామం గచ్చకాయలపోరలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండం వద్ద భారీ ప్రమాదం తప్పింది. నిప్పుల గుండం వద్ద చిచ్చుబుడ్డి వెలిగించగా ప్రక్కనే ఉన్న బాణసంచాపై నిప్పురవ్వలు పడి ఒక్కసారిగా బాణసంచా పేలింది. దీంతో స్దానికులు భయంతో పరుగులు తీశారు. ఎవరికీ అపాయం కలుగకపోవడంతో కార్యక్రమం యధావిధిగా కొనసాగించారు.



