తెలంగాణ
Komatireddy Venkat Reddy: వెంకట్‌రెడ్డి ఉండొద్దంటే విషం ఇచ్చి చంపండి

Komatireddy Venkat Reddy: నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేసానన్నారు. రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతి ఫైల్ నా దగ్గరకి రాలేదన్నారు. నాకు తెలియకుండానే రెండు సినిమాల జీవోలు వచ్చాయన్నారు.
నేను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదు పెట్ట దల్చుకోలేదన్నారు. నిప్పులాగా బతికిన వాడిని ఇలా మానసికంగా బాధ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్లను దేవుడే శిక్షిస్తాడు. జిల్లా మంత్రిగా రివ్యూ పెడితే అధికారులు పక్కన కూర్చోవడం తప్పా?. ఎన్నో విమర్శలు వచ్చినా ఆరుసార్లు గెలిచానన్నారు. వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.



