తెలంగాణ

Komatireddy Venkat Reddy: నిరుద్యోగులు స్కిల్స్‌పై ఫోకస్ పెట్టాలి

Komatireddy Venkat Reddy: దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలు లేక యువత గంజాయికి అలవాటు పడుతున్నారన్నారు. సినిమా టెక్నీషియన్‌కు న్యాక్‌లో ట్రైనింగ్ ఇస్తామని త్వరలోనే దిల్ రాజు, సినిమా వారితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. డిగ్రీ తీసుకున్న విద్యార్థులకు స్కిల్స్ ఉండడంలేదు, యూపీ, బీహార్ కార్మికులు హైదరాబాద్ వచ్చి పనులు చేసుకుంటున్నారన్నారు.

ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వాళ్లు మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి జాబ్‌లు అడుగుతున్నారని మంత్రి అన్నారు. వారిని కంపెనీలకు పంపిస్తే స్కిల్స్ లేవని వెనక్కి పంపుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందుకోసమే నల్గొండలో స్కిల్స్ సెంటర్ ఏర్పాటు చేశామని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button