తెలంగాణ
అలిగిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆగ్రహం

నాగార్జున సాగర్ నీటి విడుదలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టారు. మంత్రి ఉత్తమ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలిగారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లు విడుదల చేయడానికి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9గంటల వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు.
10 గంటల వరకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రాలేదు తమను ఉదయం 9గంటలకే ఎయిర్‌పోర్ట్‌కు రావాలని చెప్పిన ఉత్తమ్ 10గంటలకు ఎలా వస్తాడని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఆలస్యంగా రావడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలిగి వెళ్లిపోయాడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేకుండానే మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ నాగార్జున సాగర్‌కు హెలికాప్టర్‌లో వెళ్లారు.