తెలంగాణ

ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్సై

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం. రమేష్ అక్రమ బియ్యం తరలింపు కేసులో లారీ యజమాని పేరు తొలగించేందుకు లంచం డిమాండ్ చేసి అరెస్టయ్యాడు. అయితే లారీ ఓనర్ నుంచి ఎస్ఐ 30 వేల లంచం డిమాండ్ చేయగా తొలి విడతలో 5 వేలు చెల్లించాడు బాధితుడు. 20 వేలు ఇవ్వాలని ఎస్సై ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో.. తాజాగా ఎస్ఐను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button