ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: నాని బియ్యం దొంగే కాదు.. గుమ్మడి కాయల దొంగ

Kollu Ravindra: మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. నాని బియ్యం దొంగే కాదు..గుమ్మడి కాయల దొంగ కూడా అని కొల్లు రవీంద్ర విమర్శించారు. మట్టి మాఫియాపై నాని మాట్లాడుతుంటే దొంగే దొంగ అన్నట్టు ఉందని ఆయన మండిపడ్డారు.
గుమ్మడికాయాల దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్లు పేర్ని నాని మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ అధికారంలో ఐదేళ్లు మట్టిని కొల్లగొట్టిన నాని నేడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.