ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: గత ఐదేళ్లు రోడ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు

Kollu Ravindra: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సుల్తానగరం నుండి ఎస్.ఎన్.గొల్లపాలెం వరకు, ఘంటలమ్మపాలెంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలు ఎలా పోయినా మాకెందుకు అన్నట్లు గత పాలకుల పాలన సాగిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడచుకుంటున్నామన్నారు.
అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లు సాకారం చేసే దిశగా అడుగులు వేశామన్నారు. రోడ్ల నిర్మాణం ప్రభుత్వ బాధ్యత కానీ వాటిని కాపాడుకోవాల్సింది ప్రజలే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దమ్ము చక్రాల ట్రాక్టర్ల కారణంగానే ఎక్కువగా రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు.



