ఆంధ్ర ప్రదేశ్

Kollu Ravindra: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Kollu Ravindra: మచిలీపట్నంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రెవెన్యూ, పింఛన్లు, ఇంటి స్థలాల అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో మౌలిక వసతులు లేక అవస్థలు పడ్డారని అన్నారు.

పేదలకు గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తున్నామని వెల్లడించారు. బందరులో పర్యాటకాభివృద్ధికి మైరా, పోస్ట్‌కార్డ్‌ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. గోవా నుంచి షిప్ తయారీ పరిశ్రమ, ఇతర దేశాల సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు. అన్నింటికీ త్వరలో భూములు కేటాయించి పనులు ప్రారంభిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button