ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: పేదల బియ్యాన్ని బొక్కేసిన.. పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి

Kollu Ravindra: మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. పేదల బియ్యాన్ని బొక్కేసిన పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు.
పేర్ని నాని ప్రెస్ మీట్‌పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేరం మొగవాడు చేసినా.. ఆడవాళ్లు చేసినా నేరం నేరమే అవుతుందని చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సూత్రధారి పేర్ని నానినే అని కొల్లు రవీంద్ర అన్నారు.