జాతియం

Kolkata Doctor Murder Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు నిందితుడికి నేడు శిక్ష ఖరారు

Kolkata Doctor Murder Case: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి శిక్ష ఏంటనేది.. మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇవాళ సిల్దా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. కానీ.. శిక్షను మాత్రం నేటికి వాయిదా వేసింది. గతేడాది ఆగస్టు 9న ఆర్జీకర్ జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలు, పలు పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఆగస్టు 10న సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. కేసు తీవ్రత దృష్ట్యా.. విచారణను సీబీఐకి బదిలీ చేసింది కోల్‌కతా కోర్టు.

సంజయ్‌కు లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించింది. దర్యాప్తు అనంతరం కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. స్థానిక పోలీసుల దగ్గర పౌర వలంటీరుగా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌.. ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆస్పత్రి సెమినార్‌ హాల్‌లో ట్రెయినీ డాక్టర్‌ తన బ్రేక్‌ సమయంలో.. విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. 120 మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలు సేకరించింది. ఇవన్నీ రాయ్‌నే ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్నాయని సీబీఐ వర్గాలు చార్జిషీట్‌లో తెలిపింది. సీబీఐ ఆధారాల మేరకు సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చింది కోర్టు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button