తెలంగాణ
కాళేశ్వరంలో ఘనంగా కోజాగిరి పౌర్ణమి వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘనంగా కోజాగిరి పౌర్ణమి వేడుకలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం మండపంలో భక్తులు భజన సంకీర్తనలను ఆలపించారు. అనంతరం ఆలయ ఆవరణ వేదికగా అర్చకులు ప్రత్యేక పళ్లెం నిండుగా పాలను పోసి, కౌముది పూజను నిర్వహించారు.
పున్నమి చంద్రుని ప్రతిబింబం పాలల్లో వీక్షించారు. ఆలయ అర్చకులు కోజాగిరి పౌర్ణమి విశిష్టతను తెలియజేశారు. అనంతరం భక్తులకు తీర్థ వితరణలో భాగంగా పాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.



