తెలంగాణ
Kishan Reddy: యువతే మన భారతదేశానికి బలం

Kishan Reddy: సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో రోజ్ గారి మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో యువత పాత్ర కీలకం అన్నారు. ఇప్పటివరకు 15 విడతలలో దేశ వ్యాప్తంగా సుమారు 10లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 51 వేల మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందచేయడం సంతోషముగా ఉందన్నారు.