తెలంగాణ
హామీలు అమలు చేతకాదు కానీ సవాల్ విసురుతున్నావ్.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy: హామీల అమలు చేతకాదు కానీ .. సవాల్ విసురుతున్నాడని సీఎం రేవంత్‌పై ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. నారాయణ పేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై కిషన్ రెడ్డి స్పందించారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీల్లో కనీసం 20 శాతం అమలు చేసి సవాల్ చేస్తే దానికి అర్థం ఉంటుందని విమర్శించారు. ముందు రాహుల్ గాంధీతో కలిసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అప్పడు సవాల్‌కు తాను రెడీ అని కిషన్ రెడ్డి అన్నారు.