తెలంగాణ

Kishan Reddy: సీఎం రేవంత్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు

Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపణలు చేశారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. మెదక్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీచేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని మలు చేయడం లేదని విమర్శించారు.

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పు రానుందని కిషన్ రెడ్డి హితవు పలికారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button