తెలంగాణ
Kishan Reddy: తెలంగాణను రాష్ట్ర పాలకులు అప్పలు ఊబిలోకి నెట్టారు

Kishan Reddy: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు రాష్ట్ర పాలకులే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ పురోగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పీఏం కిసాన్ 20వ విడత నిధుల విడుదల సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.
క్రమం తప్పకుండా రైతులకు నిధులు విడుదల చేసి పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీదేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారణాసిలో ప్రధాని మోడీ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించగా దేశంలోని పలుచోట్ల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.