తెలంగాణ
HYDRA: శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

HYDRA: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు జరిపారు. మున్సిపాలిటీ పరిధిలో సంపత్‌నగర్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
ప్రభుత్వ భూమి ఆక్రమించి కట్టడాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, పార్కు స్థలాలి ఆక్రమిస్తే కూల్చివేతలు జరుపుతామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.