Kingdom: ‘కింగ్డమ్’ గ్రాండ్ ప్రీమియర్ షోల టైమింగ్స్ ఏంటంటే?

Kingdom: విజయ్ నటించిన ‘కింగ్డమ్’ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ డ్రామా అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. యూఎస్‌లో ప్రీమియర్ షోలు బుధవారం రాత్రి నుంచి మొదలు. భారత్‌లో స్పెషల్ షోలపై ఉత్కంఠ నెలకొంది.
విజయ్ నటించిన ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ స్పై యాక్షన్ డ్రామా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. యూఎస్‌లో బుధవారం రాత్రి 11 గంటలకు ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. తూర్పు తీరంలో మధ్యాహ్నం 1:30, సెంట్రల్‌లో 12:30, పశ్చిమ తీరంలో ఉదయం 10:30కి షోలు ఉంటాయి.
భారత్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్‌లు లేవని చిత్రబృందం స్పష్టం చేసింది. అయితే, విడుదల రోజున తెల్లవారుజామున 4 లేదా 7 గంటలకు స్పెషల్ షోలు ఉండొచ్చని సమాచారం. అనిరుద్ రవిచందర్ సంగీతం, సత్యదేవ్, వెంకటేష్‌ల కీలక పాత్రలు సినిమాకు హైలైట్. అడ్వాన్స్ బుకింగ్‌లు జోరందుకున్నాయి.