సినిమా

Akhanda 2: అఖండ 2 తాండవం నుంచి కీలక అప్డేట్

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం అఖండ 2 తాండవం గురించి అభిమానుల్లో ఉత్కంఠ రగిలిపోతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి పాన్ ఇండియా ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు బోయపాటి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ విషెస్‌తో పాటు కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే…

అఖండ 2 తాండవం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బోయపాటి బ్రాండ్ యాక్షన్, బాలయ్య ఎనర్జీతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల సినిమా విడుదల సంక్రాంతికి వాయిదా పడిందన్న రూమర్స్ హల్‌చల్ చేశాయి. అయితే, మేకర్స్ ఈ వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు.

అఖండ 2 తాండవం ఖచ్చితంగా సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. బోయపాటి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పవర్‌ఫుల్ విషెస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button