News
Posani Krishna Murali: పోసాని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Posani Krishna Murali: పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, వారి కుటుంబాల్లో మహిళలను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు ఉన్నాయన్న పోలీసులు, తనపై 14 కేసులు ఉన్నట్టు పోసానికే తెలియదని వెల్లడించారు.
దళితులను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. పోసాని సినీరంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వ్యాఖ్యలు చాలామందిపై ప్రభావం చూపుతాయని పోలీసులు చెబుతున్నారు. సమాజంలో విభజన తెచ్చేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయన్న పోలీసులు ప్రస్తుతం విచారణకు పోసాని సహకరించలేదంటున్నారు.