నేడు గాంధీ భవన్‌లో పలు కీలక సమావేశాలు

నేడు గాంధీ భవన్‌లో పలు కీలక సమావేశాలు జరుగనున్నాయి. కాసేపట్లో PAC, అడ్వైజరీ కమిటీ ఉమ్మడి భేటీ కానుంది. అనంతరం మధ్యాహ్నం 12గంటలకి కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం ప్రారంభంకానుంది. ఈ భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు.
PAC అండ్ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో పార్టీ బలోపేతం, అంతర్గత విషయాలపై చర్చ జరుగనుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై కూడా నేతలు చర్చించనున్నారు.
మరోవైపు ఇవాళ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభ జరుగనుంది. సాయంత్రం 4గంటలకి ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జైబాపు.. జైభీం.. జైసంవిధాన్‌లో భాగంగా సభను తలపెట్టారు. ఈ సభకు ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రేవంత్, మంత్రులు, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులకు పార్టీ బలోపేతం, సామాజిక న్యాయంపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.