టాలీవుడ్
IT Raids: ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలక అంశాలు
IT Raids: ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వహకులు రవిశంకర్.. నవీన్‌ను ఐటీ అధికారులు విచారించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2మూవీ.. భారీ లాభాలు రాబట్టినట్లు గుర్తించారు. వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించారు. మైత్రి మూవీ మేకర్స్.. బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
దిల్‌రాజు ఇల్లు, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి.. నిర్మాత శిరీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఆదాయ, వ్యయాలపై విచారిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. వారం రోజుల్లో 203 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.