తెలంగాణ
Davos: తెలంగాణలో భారీ పెట్టుబడులపై దావోస్‌లో కీలక ఒప్పందాలు

Davos: దావోస్‌లో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందాలు చేసుకుంది. సన్ పెట్రో కెమికల్స్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 45 వేల 500 కోట్ల పెట్టుబడుల పెట్టేందుకు సన్ పెట్రో కెమికల్స్ అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7 వేల మందికి ఉద్యోగాలు లభించనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది.
మరోవైపు.. JSW UAV లిమిటెడ్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో అధునాతన అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 800 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి.. తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది.