MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగింది

MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఆమె మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్ పార్టీ, మొదటి ప్రధాని నెహ్రూ అని కవిత గుర్తు చేశారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదన్నారు. వి.పి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు.
అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదన్నారు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది కానీ ఆ నివేదికను ఇప్పటివరకు బయట పెట్టలేదన్నారు. ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.



