ఆంధ్ర ప్రదేశ్
కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kethireddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం కేసులో వైసీపీపై చంద్రబాబు ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని జోగి రమేష్ సవాల్ చేసిన అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
జనార్థన్ రావు కల్తి లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని చందమామ కథలు చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు చెప్పారని జనార్ధన్ రావు ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారు చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.



