ఆంధ్ర ప్రదేశ్

తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

తాడిపత్రి లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆటంకాలు కల్పిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో మరోసారి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు తీసుకువెళ్లి తాడిపత్రిలో వదిలివేయాలని హైకోర్టు ఆదేశించడంతో
సోమవారం ఉదయం తాడిపత్రి కి పోలీసులు తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని హైకోర్టు సూచించింది.

సుమారు 700 మంది పోలీసులతో అధికారులు ఏర్పాటు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకవైపు తాడిపత్రిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో అనంతపురం రోడ్డు లో భారీ శివుడు విగ్రహం ప్రారంభోత్సవం చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి భారీగా తరలిరావాలని కార్యకర్తలకు జేసీ పిలుపునిచ్చారు. పెద్దారెడ్డి చేసిన అరాచకాలు తట్టుకోలేని తాడిపత్రి ప్రజలు పెద్దారెడ్డి తాడిపత్రి కి వస్తే అడ్డుకుంటారని జెసి ప్రభాకర్ రెడ్డి పేర్కొనడంతో తాడిపత్రి లో హై టెన్షన్ నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button