ఆంధ్ర ప్రదేశ్
Kesineni Brothers: రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని బ్రదర్స్

Kesineni Brothers: రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేసారు. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్టయిన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని నాని ఆరోపించారు.
కేశినేని చిన్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన నాని లిక్కర్ స్కాం కేసులో చిన్నిని కూడా విచారించాలన్నారు. కేసిరెడ్డి కంపెనీలో చిన్ని కుటుంబానికి కూడా వాటా ఉందన్నారు. చిన్ని కంపెనీల్లోనూ కేసిరెడ్డి పార్టనర్ గా ఉన్నాడని తెలిపారు. మనీ లాండరింగ్ ద్వారా నిధులు విదేశాలకు మళ్లించారని నాని ఆరోపించారు.