ఆంధ్ర ప్రదేశ్

Kesineni Nani: రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై స్పందించిన కేశినేని నాని

Kesineni Nani: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ వార్తలపై స్పందించారు మాజీ ఎంపీ కేశినేని నాని . కొద్దిరోజులుగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని, బీజేపీలో ఆయన చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజా ప్రచారంపై కేశినేని నాని స్పందించారు. ఈ సందర్బంగా ఊహాగానాలకు ప్రతిస్పందనగా నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేయాలనుకుంటున్నాను.

ఈ ఏడాది జనవరి 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాను. ఆ నిర్ణయం మారదు. అయితే, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేస్తాను. సమాజానికి నా సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని కేశినేని నాని ట్వీట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button