ఆంధ్ర ప్రదేశ్

Kesineni Nani: కేశినేని నాని ఇంటిపై దాడి.. చంపేస్తామంటూ బెదిరింపులు

Kesineni Nani: విజ‌య‌వాడ సీపీకి మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. ఓ వ్య‌క్తి త‌న‌ను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడ‌ని మాజీ ఎంపీ వెల్ల‌డించారు. త‌న ఇంటిపై దాడి చేసి చంపుతాన‌ని వార్నింగ్ ఇచ్చిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌కు కేశినేని నాని లేఖ రాశారు. ఫోన్‌లో త‌న‌ను కడియాల చక్రవర్తి అనే వ్య‌క్తి బెదిరించాడ‌ని లేఖలో పేర్కొన్నారు.

ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో తన పేరుతో పాటు ఎంపీ కేశినేని చిన్నిపేరును ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడని కేశినేని నాని వివ‌రించారు. త‌న‌ను చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వయిరీ చేయాలని విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button