ఆంధ్ర ప్రదేశ్
Kesineni Chinni: కేశినేని నాని వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఎంపీ చిన్ని

Kesineni Chinni: లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను ఎంపీ చిన్ని కొట్టిపారేశారు. ఆయన చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీ అధినేత జగన్కు కొమ్ముకాసిన వ్యక్తి నాని అంటూ చిందులు తొక్కారు. తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండటంతో కలిసిన నిర్మాణ పనులు చేపట్టేందుకు.. 2021లో రిజిస్టర్ అయిన సంస్థ అది అని తెలిపారు.
తాను రాజకీయాల్లోకి రాకముందే కేసిరెడ్డితో సంస్థతో తెగతెంపులు చేసుకున్నానని అన్నారు. అందుకు తాను చాలా నష్టపోయానని పేర్కొన్నారు. విదేశాల్లో పెట్టుబడులు అంటూ నాని చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. దమ్ముంటే తనకు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా నిరూపించాలని చిన్ని ఫైర్ అయ్యారు.