SLBC Tunnel: 14వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి కేరళ పోలీసు జాగిలాలు

SLBC Tunnel: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 14వ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం రంగంలోకి కేరళ పోలీసు జాగిలాలు దిగాయి. మరోవైపు మినీ పొక్లెయిన్‌తో తవ్వకాలు చేపట్టారు అధికారులు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో 13.5కిలోమీటర్ల దగ్గర కన్వేయర్ బెల్ట్‌ను సింగరేణి, జేపీ కంపెనీ ఇంజినీర్లు రీస్టార్ట్ చేశారు.
కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్‌లోకి వెళ్లింది. ఇవి బురదలో కూరుకుపోయిన వారి వాసన పసిగట్టనుంది. మరోవైపు టీబీఎం మెషీన్‌ను రైల్వే సిబ్బంది కట్ చేస్తోంది. లోకో ట్రైన్ ద్వారా మెషీన్ విడిభాగాలు తరలిస్తున్నారు. అలాగే మినీ ప్రొక్లయిన్ మెషీన్ ద్వారా తవ్వేందుకు యత్నాలు జరుగుతున్నాయి. జీపీఆర్ డేటా ఆధారంగా 8 స్పాట్స్ గుర్తించగా నాలుగు ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. తవ్వుతుండగా ఊట నీరు ఉబికి వస్తోంది. దీంతో భారీ మోటర్లతో నీళ్లను బయటకు తరలిస్తోంది సిబ్బంది.