తెలంగాణ
మాజీ సీఎం కేసీఆర్‌కి మరోసారి వైద్య పరీక్షలు

మాజీ సీఎం కేసీఆర్‌కి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారాం. దీంతో కొద్దిసేపట్లో మరో హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే యశోద ఆసుపత్రి కి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి కేసీఆర్‌తో మాట్లాడారు. ఇప్పటికే యశోద ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు పలువురు కీలక నేతలు ఉన్నారు.
మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అదేవిధంగా కేసీఆర్‌కి షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని అండ్ ప్రస్తుతం కేసీఆర్‌కి సోడియం లెవె ల్స్ తగ్గినట్లు తెలిపారు. దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి తెచ్చి సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. నీరసంగా ఉండటంతో నిన్న యశోద ఆసుప త్రిలో చేరారు కేసీఆర్.