MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన కేసీఆర్

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను కేసీఆర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించేలా ఆమె ప్రవర్తిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కవిత నెక్స్ట్‌స్టెప్ ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని తెలుస్తోంది. నేడు నిర్వహించబోయే ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అంశాన్ని కూడా వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతూ నిరసన గళం వినిపించిన కవిత సస్పెన్షన్ తర్వాత ఏం మాట్లాడబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు..? ఎవరి బండారం బయటపెట్టబోతున్నారు. ఆమె రాజకీయ వ్యూహం ఏమిటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.



