KCR: మంచి రోజులు వస్తాయ్.. అధైర్యపడొద్దు.. మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR: కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవెల్లి, నర్సన్నపేటలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను కేసీఆర్ సత్కరించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవన్నారు. కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి.
కష్టాలు వచ్చినప్పుడు వెరవకూడదన్నారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తిరిగి పల్లెలకు మంచిరోజులు వస్తాయి. అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దన్నారు కేసీఆర్. కొత్త సర్పంచ్‌లు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని ఆయన సూచించారు.
ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన స్ఫూర్తి ద్వారా స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకోవాలన్నారు కేసీఆర్.



