తెలంగాణ
KCR: నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం

KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ఆరోగ్యం నిలకడగా ఉంది. కేసీఆర్‌కు జ్వరం తగ్గినట్లు సమాచారం. షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్‌కి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఇవాళ కేసీఆర్ యశోద ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. డిశ్చార్జ్ అనంతరం నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు కేసీఆర్.
రెండ్రోజులపాటు నందినగర్ నివాసంలో ఉండను న్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రేపు కేసీఆర్ మీడియా సమావేశం ఉండే అవకాశం. ప్రధానంగా నీటివివాదాలపై స్పందించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే నిన్న పార్టీ నేతలతో ఇదే అంశంపై కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు.