కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కి సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరో గ్యం నిలకడగా ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా కేసీఆర్‌కి షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని అండ్ ప్రస్తుతం కేసీఆర్‌కి సోడియం లెవెల్స్ తగ్గినట్లు తెలిపారు.
దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి తెచ్చి సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. నీరసంగా ఉండటంతో నిన్న యశోద ఆసుపత్రిలో చేరారు కేసీఆర్. ప్రస్తుతం కేసీఆ ర్ వెనుక కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు ఉన్నారు.
మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కేసీఆ ర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. అటు కాసేపట్లో యశోద ఆసుపత్రికి చేరుకోనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక కాసేపట్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు అనంతరం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.