తెలంగాణ
KCR: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు

KCR: జయ జయహే తెలంగాణ అనే ఉద్యమ గీత రచయిత, ప్రముఖ కవి డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమానికి అందెశ్రీ తన సాహిత్యంతో, పాటలతో గొప్ప ప్రేరణనిచ్చారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో ఉన్న తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



